Share News

నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదన్నందుకు భర్తను నరికి చంపిన భార్య

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:41 AM

నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదని ప్రశ్నించినందుకు ఓ భార్య తన భర్తను కొడవలితో నరికి చంపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదన్నందుకు భర్తను నరికి చంపిన భార్య

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదని ప్రశ్నించినందుకు ఓ భార్య తన భర్తను కొడవలితో నరికి చంపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని వాంబేకాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివాజీ(31), లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా గోడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి నాన్‌వెజ్‌ ఎందుకు వండలేదని శివాజీ తన భార్య లక్ష్మిని ప్రశ్నించాడు. ఆవేశానికి గురైన లక్ష్మి పక్కనే ఉన్న కూరగాయలు కోసే కొడవలితో శివాజీ మెడపైన వేటు వేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 04:41 AM