Share News

ప్రేమజంటను బెదిరించి బాలికపై గ్యాంగ్‌ రేప్‌

ABN , Publish Date - May 03 , 2026 | 04:42 AM

మైనర్‌ ప్రేమ జంటను బెదిరించి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల పరిధిలో జరిగింది.

ప్రేమజంటను బెదిరించి బాలికపై గ్యాంగ్‌ రేప్‌

  • మొదట డబ్బు వసూలు.. ఆపై అత్యాచారం

  • ఇద్దరు యువకులకు రిమాండ్‌

  • మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలో ఘటన

మహబూబ్‌నగర్‌/హన్వాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): మైనర్‌ ప్రేమ జంటను బెదిరించి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల పరిధిలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా పరిగిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. వారు శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా ప్రధాన రహదారి వెంబడి ఉన్న అడవుల్లోకి వచ్చారు. వారిని గమనించిన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన అశోక్‌, లక్ష్మణ్‌ అనే యువకులు వారిని బెదిరించి మొదట రూ. 6 వేల నగదును వసూలు చేశారు. అంతటితో ఆగకుండా ప్రియుడిని బెదిరించి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడు 100కు కాల్‌ చేయడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, పోలీసులు ఈ ప్రాంతంపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 04:42 AM