మద్యం మత్తులో బావిలో పడిన వ్యక్తి
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:01 AM
ప్రమాదవ శాత్తు బావిలో పడిన ఓ వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి కూడా అందులో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా వెంక టాపురం మండల ...
అతడిని కాపాడబోయి మరో వ్యక్తి కూడా మృతి
వెంకటాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవ శాత్తు బావిలో పడిన ఓ వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి కూడా అందులో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా వెంక టాపురం మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బీసీమర్రిగూడెం గ్రామానికి చెందిన బద్ది రమేశ్(35) మద్యం మత్తులో బావిలో పడిపోయి రక్షించాలని కేకలు వేశాడు. ఆ గ్రామానికి కూలిపని కోసం వచ్చిన చర్చిపేటకు చెందిన రేగ నర్సింహారావు(40) ఆ కేకలు విని రమేశ్‌ను కాపాడేందుకు బావిలోకి తాడుకట్టుకుని దిగాడు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక నీటిలో మునిగి ఇద్దరూ మృతి చెందారు. సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకుని బావిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందితో మృతదేహా లను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.