Share News

ముగ్గురు చిన్నారులతో బావిలోకి దూకిన తల్లి

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:25 AM

ఏ కష్టం వచ్చిందో ఏమోకానీ..ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ముగ్గురు చిన్నారులతో బావిలోకి దూకిన తల్లి

  • నలుగురూ మృతి.. కర్ణాటకలో ఘోరం

బెంగళూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఏ కష్టం వచ్చిందో ఏమోకానీ..ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా ఇండి తాలూకా నిరగి గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరప్ప ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గురువారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య రాజశ్రీ (28), పిల్లలు అనుశ్రీ(6), తను(3), కుమారుడు సంతోష్ (1) కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామస్థులతో కలిసి పొలాలు, బావుల వద్ద వెతికి చూశారు. నలుగురూ ఓ వ్యసాయ బావిలో శవాలై కనిపించారు.

Updated Date - Mar 28 , 2026 | 06:25 AM