గంజాయి నెట్‌వర్క్ గుట్టు రట్టు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:37 AM
అంతరాష్ట్ర గంజాయి ముఠా నెట్‌వర్క్ గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.కోటి విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
కోటి విలువైన 200 కేజీల సరుకు స్వాధీనం..ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): అంతరాష్ట్ర గంజాయి ముఠా నెట్‌వర్క్ గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.కోటి విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్-ఒడిసా సరిహద్దుల నుంచి గంజాయి లోడ్‌తో వాహనాలు బయలుదేరాయని, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్నాయన్న పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆ వాహనాలను ఖమ్మం సరిహద్దు వద్ద అడ్డుకుని, అమోల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగ్‌నాథ్ కరే(మహారాష్ట్ర), వసంత జాదవ్, షేక్ అన్సార్, షేక్ రహ్మత్(తెలంగాణ)లను అరెస్ట్ చేసింది. 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి రవాణా నెట్‌వర్క్‌కు సూత్రధారి అయిన ప్రభు(మహారాష్ట్ర)తో పాలు మరో కీలక నిందితుడు దేవీ సింగ్(ఒడిసా) కోసం గాలింపు చేపట్టింది.