తమిళ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:37 AM
కయల్’ అనే తమిళ సీరియల్‌లో నటిస్తున్న బుల్లితెర నటి సుభాషిణి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరులో ఉన్న తన భర్తకు చివరగా వీడియో కాల్ చేసి...
చెన్నై, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘కయల్’ అనే తమిళ సీరియల్‌లో నటిస్తున్న బుల్లితెర నటి సుభాషిణి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరులో ఉన్న తన భర్తకు చివరగా వీడియో కాల్ చేసి, ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీలంకకు చెందిన సుభాషిణి.. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాలన్న కోరికతో భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. తన భర్తతో కలిసి బెంగుళూరులో ఉంటున్న ఆమె సీరియల్ షూటింగ్ నిమిత్తం స్థానిక అయ్యప్పన్ తాంగల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు.. అయితే, సుభాషిణికి భర్తతో మనస్పర్థలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగుళూరులో ఉన్న తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడిన తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.