Share News

నవవధువు ఆత్మహత్య

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:58 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) బలవన్మరణానికి పాల్పడ్డారు.

నవవధువు ఆత్మహత్య

  • అత్తారింటికి వెళ్లాలన్న డిప్రెషన్‌లో బలవన్మరణం

తాడిపత్రి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు గత నెల 26న కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా గరుడహళ్లికి చెందిన విజయ్‌ కుమార్‌తో వివాహమైంది. లక్ష్మీప్రసన్న తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అత్తారింటికి తీసుకెళ్లేందుకు ఆమె భర్త మంగళవారం తాడిపత్రికి వచ్చారు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం బాగాలేదని, మరో గదిలో పడుకుంటానని బుధవారం తెల్లవారుజామున లక్ష్మీ ప్రసన్న భర్తకు చెప్పారు. ఉదయం ఏడు గంటల సమయంలో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. తన కుమార్తె ఆత్మహత్యకు డిప్రెషన్‌ కారణమని లక్ష్మీప్రసన్న తండ్రి నాగసుబ్బరాయుడు ఫిర్యాదు చేశారని తాడిపత్రి రూరల్‌ సీఐ శివగంగాధర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 04:59 AM