Share News

‘ఫెయిల్‌’ భయంతో ప్రాణం తీసుకున్న విద్యార్థిని..ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యింది

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:58 AM

పదో తరగతి తప్పుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధి పొడిచన్పల్లి తండాకు...

‘ఫెయిల్‌’ భయంతో  ప్రాణం తీసుకున్న విద్యార్థిని..ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యింది

పాపన్నపేట, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి తప్పుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధి పొడిచన్పల్లి తండాకు చెందిన బానోత్‌ రమేశ్-లతల రెండో కుమార్తె సాయిప్రియ పది పరీక్షలు రాసినప్పటి నుంచి.. ఫెయిల్‌ అవుతాననే ఆందోళనతో ఉండేది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి.. ‘ఫెయిల్‌ అయినా ఏం కాదు’ అని ధైర్యం చెప్పింది. అయినా, భయం వీడని సాయిప్రియ ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. బుధవారం ఫలితాలు చూస్తే.. సాయిప్రియ 480 మార్కులతో ఫస్ట్‌క్లా్‌సలో పాసయ్యింది. దీంతో ఆమెను తల్చుకుని ఆ కుటుంబం మరోసారి విషాదంలో మునిగిపోయింది.

Updated Date - Apr 30 , 2026 | 06:32 AM