Share News

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:09 AM

ప్రేమ పేరుతో వేధిస్తూ తన వెంట రావాలని ఓ యువకుడు ఒత్తిడి చేయగా ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై బ్లేడ్‌తో దాడిచేసి గాయపరిచాడు.

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

  • మందసలో నిందితుడి అరెస్ట్‌

హరిపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో వేధిస్తూ తన వెంట రావాలని ఓ యువకుడు ఒత్తిడి చేయగా ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై బ్లేడ్‌తో దాడిచేసి గాయపరిచాడు. శ్రీకాకుళం జిల్లా మందసలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ కథనం మేరకు.. మందస మండలం చిక్కిడిగాం గ్రామానికి చెందిన రింటూ గౌడ్‌(25) ఈనెల 12న సాయంత్రం మందస బస్టాండ్‌ వద్దకు వచ్చాడు. అప్పటికే బస్సు కోసం వేచి ఉన్న ఇంటర్‌ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ప్రేమిస్తున్నానని చెప్పి.. తనతో రావాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించగా రింటు గౌడ్‌ బ్లేడ్‌తో ఆమె చేతిపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థినిని స్థానికులు హరిపురం సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రింటూగౌడ్‌ను అరెస్టు చేశారు.

Updated Date - Aug 17 , 2026 | 05:12 AM