కులవివక్షకు ప్రేమజంట బలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:47 AM
కులా లు వేరన్న కారణంతో పెద్దలు చూపిన వివక్ష ప్రేమజంట ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దల అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురై రెండు....
పెద్దలు అంగీకరించలేదని ప్రియుడు..
అతడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
నర్మెట/చేర్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కులా లు వేరన్న కారణంతో పెద్దలు చూపిన వివక్ష ప్రేమజంట ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దల అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురై రెండు రోజుల వ్యవధి లో ఒకరి తర్వాత ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక(22), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్‌రెడ్డి(25) ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకుని హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. పెద్దలు 3నెలల తర్వాత స్వగ్రామానికి తీసుకొచ్చారు. కులాలు వేరు కావడంతో రాకేష్‌రెడ్డి కుటుంబసభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు ప్రియుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమయం ఇస్తే పెళ్లిచేస్తామని వారు మాటిచ్చారు. విషయం తేలేలా లేదని భావించిన రాకే్‌షరెడ్డి(25) మార్చి 28న పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. నర్మెటలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోన్న హారిక.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.