Share News

అత్తపై అల్లుడి లైంగికదాడి భార్యను గదిలో బంధించి ఘాతుకం

ABN , Publish Date - May 09 , 2026 | 06:44 AM

భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండటంతో సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను ఓ గదిలో బంధించి అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

అత్తపై అల్లుడి లైంగికదాడి భార్యను గదిలో బంధించి ఘాతుకం

వట్‌పల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండటంతో సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను ఓ గదిలో బంధించి అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖదీరాబాద్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన భార్యాభర్తల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త రోజూ తాగివచ్చి గొడవ పడుతున్నాడని భార్య తన తల్లి వద్ద మొరపెట్టుకుంది. దీంతో వారికి సర్దిచెబుదామని భార్య తల్లి ఈ నెల 6న కుమార్తె ఇంటికి వచ్చింది. మద్యం తాగి వచ్చిన భర్త, భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. అత్త అడ్డుకోబోయింది. దీంతో అల్లుడు భార్యను ఓ గదిలో బంధించి, అత్తను మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జోగిపేట పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌కు పంపించినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - May 09 , 2026 | 06:45 AM