82 సిలిండర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
ABN , Publish Date - May 06 , 2026 | 07:13 AM
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల దొంగతనం కలకలం రేపింది. స్థానిక మనీషా ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలోకి సోమవారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు...
సంగారెడ్డి జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ గోదాంలో చోరీ
కోహీర్, మే 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల దొంగతనం కలకలం రేపింది. స్థానిక మనీషా ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలోకి సోమవారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు ఏకంగా 82 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ముందుగా గోదాం ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను పగలగొట్టిన దొంగలు, ఆపై గోదాం తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. గోదాంలోని 51 నిండు సిలిండర్లు (డొమెస్టిక్), 31 ఖాళీ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం సిబ్బంది గోదాంకు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.