Share News

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:55 AM

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండం శంశోద్దీన్‌పూర్‌కు చెందిన..

సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

కంది, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండం శంశోద్దీన్‌పూర్‌కు చెందిన వినోద్‌ (24)పై సంగారెడ్డి, జహీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్లలో పలు దొంగతనం కేసులున్నాయి. అతనికి సంగారెడ్డి కోర్టు 6 నెలల శిక్ష విధించగా 4నెలల క్రితం సంగారెడ్డి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే, వినోద్‌ బుధవారం జైలులోని ఆర్వో వాటర్‌ ప్లాంట్‌లో వినియోగించే కెమికల్‌ను తాగానని అధికారులకు చెప్పడంతో వారు టాటాసుమోలో సంగారెడ్డి ప్రభుత్పాస్పత్రికి అనంతరంహైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Apr 24 , 2026 | 03:55 AM