ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువనుకున్నా!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:17 AM
పుణె యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వారిని బాధపెట్టి పెళ్లి ...
పుణె హత్య కేసు నిందితురాలు సియా
పుణె, జూన్ 27: పుణె యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వారిని బాధపెట్టి పెళ్లి రద్దు చేసుకోవడం కంటే కేతన్‌ను చంపడమే సులువైన మార్గమని భావించినట్లు విచారణలో నిందితురాలు సియా అంగీకరించిందని సమాచారం. ఈ కేసు విచారణకు లోనావాలా పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం సియా తల్లిదండ్రులను లోనావాలా పోలీస్ స్టేషన్‌లో విచారించారు. సియా సోదరుడు సాహిల్‌ను కూడా రెండో సారి విచారించారు. అయితే శుక్రవారం దాదాపు 10 గంటల పాటు సాగిన సుదీర్ఘ విచారణలో సాహిల్ కీలక విషయాలను వెల్లడించాడు. చేతన్ తనకు తెలుసని.. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అతడిని సియానే తనకు పరిచయం చేసిందని పోలీసులకు చెప్పాడు. ఒకవేళ కేతన్ నచ్చలేదని సియా ముందే చెప్పి ఉంటే.. మేం పెళ్లిని ఆపేసే వాళ్లమన్నాడు.