కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - May 26 , 2026 | 05:26 AM
కన్న కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ ...
బాధితురాలికి రూ.7లక్షల పరిహారం: పోక్సో కోర్టు తీర్పు
షాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి): కన్న కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామానికి చెందిన దాదే రాజు (37)కు జైలు శిక్షతో పాటు, రూ.2,500 జరిమానా కూడా వేసింది. మైనర్ అయిన కుమార్తెపై కన్న తండ్రే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు 2024 అక్టోబరు 12న ఆమె బంఽధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాబాద్ ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి సమగ్ర విచారణ జరిపి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని ప్రత్యేక కోర్టు జడ్జి జి.శ్రీనివాస్ నిందితుడు దోషి అని తేల్చి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం మంజూరు చేయించారు.