Share News

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

ABN , Publish Date - May 30 , 2026 | 04:39 AM

మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ పోక్సో...

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

బిట్స్‌ పిలానీ, మే 29 (ఆంధ్రజ్యోతి): మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ పోక్సో ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీఆర్పీఎఫ్‌ అరుంధతినగర్‌లో 2024 డిసెంబర్‌ 1న ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన పర్వేష్‌ యాదవ్‌(25)కు ఈ శిక్ష వేసింది. నిందితుడిని అదే ఏడాది డిసెంబర్‌ 6న పోలీసులు అరెస్టు చేయగా, అప్పటి నుంచి చర్లపల్లి జైలులోనే ఉన్నాడు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష, జరిమానా విధించింది.

Updated Date - May 30 , 2026 | 04:39 AM