దళిత, దివ్యాంగ బాలికపై లైంగికదాడి
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:56 AM
హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన 14 ఏళ్ల దళిత బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడగా...
నలుగురు యువకులపై పోక్సో, అట్రాసిటీ కేసులు
భీమదేవరపల్లి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన 14 ఏళ్ల దళిత బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడగా, అతడికి మరో ముగ్గురు సహకరించారు. భీమదేవరపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై మల్లారం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దుశ్యర్యలో అదే గ్రామానికి చెందిన మణికంఠ, వేణు, టోనీ అనే మరో ముగ్గురు యువకులు సహకరించారు. వీరందరిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ముల్కనూర్ ఎస్‌ఐ రాజు వెల్లడించారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితమే జరగగా, గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చి, రాజీ చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో దర్యాప్తు వేగవంతమైంది.