Share News

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక..విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:36 AM

ఓ మూగజీవిపై పెంచుకున్న మమకారం ఆ యువతి ప్రాణాలు తీసింది. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్థి..

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక..విద్యార్థిని ఆత్మహత్య

సరూర్‌నగర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఓ మూగజీవిపై పెంచుకున్న మమకారం ఆ యువతి ప్రాణాలు తీసింది. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరబాద్‌ నగర శివారు మీర్‌పేట్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌లోని అంజనాద్రి నివా్‌సకు చెందిన హిమబిందు(20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూగజీవాలపై మక్కువతో రెండేళ్ల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటోంది. బుధవారం తెల్లవారుజామున ఆ పెంపుడు పిల్లి ఇంటిముందే విగతజీవిగా కనిపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన హిమబిందును తల్లిదండ్రులు ఓదార్చారు. అయితే, పిల్లి మరణించిన బెంగతో ఇంట్లోని పురుగుల మందు(ఎలుకలు, బొద్దింకలు చంపడానికి ఉపయోగించేది) తిని బలవన్మరణానికి పాల్పడింది.

Updated Date - Mar 20 , 2026 | 05:36 AM