Share News

ఎయిర్‌ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన విమాన ప్రయాణికుడిపై కేసు

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:43 AM

ఎయిర్‌ హోస్టె్‌సతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడికిపై ఆర్జీఐఏ ఔట్‌ పోస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 24న ఉదయ్‌పూర్‌...

ఎయిర్‌ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన విమాన ప్రయాణికుడిపై కేసు

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌ హోస్టె్‌సతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడికిపై ఆర్జీఐఏ ఔట్‌ పోస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 24న ఉదయ్‌పూర్‌ వయా శంషాబాద్‌ నుంచి కోయంబత్తుర్‌ వెళ్తున్న విమానంలో ఉదయ్‌పూర్‌కు చెందిన ప్రవీణ్‌సింగ్‌ రాథోడ్‌ ఎయిర్‌హోస్టె్‌సతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె వీడియోలు తీశాడు. బాధితురాలు విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవగానే ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Apr 27 , 2026 | 04:43 AM