Domestic violence: కూతురు కులాంతర పెళ్లి చేసుకుంటోందని..తల్లిదండ్రులే విషమిచ్చి చంపేశారు!
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:54 AM
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు యత్నించిన మహిళా వీఏఓ అనుమానాస్పద స్థితిలో .....
చెన్నై, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు యత్నించిన మహిళా వీఏఓ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమెతో కుటుంబీకులే బలవంతంగా విషం తాగించి, హతమార్చినట్లు ఆమె ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు... అగరం గ్రామానికి చెందిన అరుణ(27) తనతోపాటు వీఏవోగా పనిచేసే శివభారతి అనే యువకుడిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నారు. అయితే ఇరువురి కులాలు వేర్వేరు కావటంతో యువతి కుటుంబీకులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. శివభారతి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 28న అరుణ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ కుటుంబీకులు ఆమెను చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వేకువజామున అరుణ కన్నుమూసింది.