Share News

నిర్మల్‌ జిల్లాలో సర్పంచ్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:09 AM

నిర్మల్‌ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడెం మండలంలోని మాసాయిపేట్‌ గ్రామ సర్పంచ్‌ దుర్గం...

నిర్మల్‌ జిల్లాలో  సర్పంచ్‌ ఆత్మహత్య

కడెం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడెం మండలంలోని మాసాయిపేట్‌ గ్రామ సర్పంచ్‌ దుర్గం లహరిక (25) శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు ఖానాపుర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కారు అదుపు తప్పి రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ నాగళ్లను ఢీకొట్టింది. దీంతో మరో వాహనంలో లహరికను ఖానాపుర్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 05:09 AM