ఐదేళ్ల బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:16 AM
నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు.
హత్యకు ముందు బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
నారాయణపేట, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట ఎస్పీ వినీత్ సోమవారం వెల్లడించారు. బాలిక గత నెల 31న గ్రామంలోని చెరువుకట్ట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాలికపై లైంగిక దాడి జరిపి హత్యచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన అనుమానితుడు 42 ఏళ్ల బక్క చిన్ననరసింహులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై 2014లోనూ నారాయణపేట పోలీ్‌సస్టేషన్‌లో అత్యాచార యత్నం కేసు నమోదైంది. అతడికి రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య విడాకులు ఇవ్వగా, రెండో భార్య తన అమ్మగారి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్పీ వెల్లడించారు. తాగిన మైకంలో ఐదేళ్ల బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.