Share News

ఊరివాడే కదా అని కారెక్కించుకుంటే..!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:58 AM

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన టీనా రోజా (31) ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసింది.

ఊరివాడే కదా అని కారెక్కించుకుంటే..!

  • వివాహితపై కత్తితో దాడిచేసి హత్య.. అడ్డుకున్న డ్రైవర్‌పైనా దాడి

  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణం

నరసాపురం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన టీనా రోజా (31) ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసింది. ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. దీనికోసం సూళ్లూరుపేటలో శిక్షణ పొందుతోంది. ప్రతి ఆదివారం ఇంటికి వచ్చే క్రమంలో నరసాపురం వచ్చిన రోజాను సఖినేటిపల్లి తీసుకువెళ్లేందుకు గ్రామానికి చెందిన అంగర సురేశ్‌ కారు తీసుకువచ్చాడు. ఇంటికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన మార్గాని రమేశ్‌ మార్గమధ్యలో లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత రోజా వాటర్‌ బాటిల్‌ కోసం ఓ షాపు వద్ద కారు దిగింది. తిరిగి కారు ఎక్కుతుండగా వెనక కూర్చున్న రమేశ్‌ ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మెడ, ఛాతీ, పొట్ట బాగంలో కత్తితో పొడిచాడు. సురేశ్‌ రమేశ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపైనా దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన సురేశ్‌ అతి కష్టమ్మీద రోజాను అదే కారులో నరసాపురం ప్రభుత్వ ఆసుపతిక్రి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే రోజా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సురేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - Jun 22 , 2026 | 05:59 AM