Share News

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:16 AM

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఈగల్‌ బృందాలు నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 20.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు

  • నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి

  • గంజాయి విక్రయాలు.. నల్లగొండలో ఐదుగురికి బేడీలు

హైదరాబాద్‌, నల్లగొండ క్రైం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఈగల్‌ బృందాలు నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 20.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కారును నిరంతరం ట్రాక్‌ చేస్తున్న ఈగల్‌ అధికారులు స్ధానిక పోలీసుల సహకారంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బికాష్‌ బారీక్‌ ఆర్డర్‌ చేయడంతో ఒడిశాకు చెందిన అమిత్‌ సాహూ వద్ద గంజాయు కొని తీసుకొస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. గంజాయి అమ్మకం కేసులో జైలుకెళ్లి బయటికి వచ్చిన బికాష్‌ బారీక్‌ కోసం గాలిస్తున్నామని, అమిత్‌ సాహూ గురించి ఒడిశా పోలీసులకు సమాచార మిచ్చామని ఈగల్‌ డైరక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10.25 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే, గంజా యి వినియోగంతో పాటు విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నల్లగొండ పోలీసు లు అరెస్టు చేశారు. నల్లగొండకు చెందిన శ్రీకాంత్‌, అభినవ్‌, నవీన్‌, పవన్‌తేజ, పెద్దిశివప్రసాద్‌ (కట్టంగూరు)లు ఒడిశాలోని పసుపులంకకు బైక్‌లపై వెళ్లి గంజాయిని కొనుగోలు చేసేవారు. తాము వినియోగిస్తూ.. ఇతరులకు విక్రయించేవారు. ఇందుకోసం శ్రీకాంత్‌, అభినవ్‌ బైక్‌లు దొంగిలించేవారు. శుక్రవారం నల్లగొండలో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 05:16 AM