ఉద్యోగం రాలేదని, ఇల్లు లేదని..
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:15 AM
ఎంబీఏ చదివినా ఉద్యోగం రాలేదని, సొంత ఊరిలో ఇల్లు లేదని మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ జిల్లాలో యువకుడి బలవన్మరణం
సిరికొండ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ చదివినా ఉద్యోగం రాలేదని, సొంత ఊరిలో ఇల్లు లేదని మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్‌లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మటి నితిన్‌గౌడ్ (27) ఎంబీఏ పూర్తిచేశాడు. అయితే సరైన ఉద్యోగం లభించలేదని, సొంత ఇల్లు కూడా లేదని గ్రామంలో తన సహచరులతో చెబుతూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సమీప అడవిలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.