తాకట్టు బంగారాన్ని కాజేసి.. 91 లక్షలకు కుదువబెట్టి!
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:19 AM
ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారే కాజేశాడు.. మరో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో దాన్ని కుదువపెట్టి వచ్చిన సొమ్మంతా సొంతానికి వాడేసుకున్నాడు.
బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ నిర్వాకం
మహబూబాబాద్ క్రైం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారే కాజేశాడు.. మరో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో దాన్ని కుదువపెట్టి వచ్చిన సొమ్మంతా సొంతానికి వాడేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో పనిచేసే లోన్ ఇన్‌చార్జ్, అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్ నాయక్.. 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాములు బంగారాన్ని కాజేశాడు. 660 గ్రాములు ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టి రూ.91 లక్షలు రుణం తీసుకుని వాడేసుకున్నాడు. మిగతా 40గ్రాముల బంగారం తన వద్దనే ఉంచుకున్నాడు. అధికారుల నెలవారీ తనిఖీలో ఈ మోసం బయటపడింది. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఇప్పటికే పరారీలో ఉన్నట్లు సమాచారం. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.