Share News

ప్రియుడే నిందితుడు!

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:23 AM

పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు గుర్తించారు.

ప్రియుడే నిందితుడు!

  • మాచర్ల ఉద్యోగిని అత్యాచారం కేసులో ట్విస్ట్‌

  • అదుపులోకి తీసుకుని పోలీసుల విచారణ

మాచర్ల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు పల్నాడు జిల్లా రాజుపాలేనికి చెందిన శ్రీనివా్‌స గా గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇరువురి మధ్య ఘర్షణలో ప్రియుడే ఆమె జననాంగాన్ని ఇనుప చువ్వతో గాయపరిచినట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. వివరాలిలీ.. సత్తెనపల్లికి చెందిన మహిళ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ అద్దె ఉంట్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఆమె ఇంట్లో నగ్నంగా గాయాలతో పడి ఉండగా, స్థానికులు గమనించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ సంతోష్‌ నేతృత్వంలో క్లూస్‌ టీం ఆ మహిళ గృహంలో కండోమ్‌ ప్యాకెట్లు, భోజనం పార్శిళ్లు, వాటర్‌ బాటిళ్లను గుర్తించింది. తెలిసిన వ్యక్తే అఘాయిత్యం చేసి ఉంటాడని భావించి, బాధితురాలి ఫోన్‌ స్వాధీనం చేసుకొని, చాటింగ్‌ ఆధారంగా నిందితుడు రాజుపాలేనికి చెందిన శ్రీనివా్‌సగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Apr 08 , 2026 | 04:23 AM