Share News

ప్రపంచ యాత్రికుడు అన్వే్‌షపై లుకౌట్‌ నోటీసులు

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:24 AM

ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్‌ అన్వే్‌షపై బుధవారం లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సినీనటి...

ప్రపంచ యాత్రికుడు అన్వే్‌షపై లుకౌట్‌ నోటీసులు

  • యూట్యూబ్‌ చానల్‌, ఇన్‌స్టా అకౌంట్‌ మూసివేయాలి

  • సంబంధిత సంస్థలకు లేఖ రాయనున్న పంజాగుట్ట పోలీసులు

పంజాగుట్ట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్‌ అన్వే్‌షపై బుధవారం లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి గతేడాది డిసెంబరులో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పోలీసులు రాసిన లేఖతో అన్వే్‌షకు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఖతా బ్లాక్‌ అయింది. విశాఖపట్నానికి చెందిన అన్వేష్‌ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకున్న ఇతర ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో పాటు యూట్యూబ్‌ చానల్‌నూ మూసివేయాలని సంబంధిత సంస్థలకు లేఖ రాయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 02:24 AM