ఆస్తి కోసం పిన్నిని నరికేశాడు!
ABN , Publish Date - May 23 , 2026 | 05:44 AM
రెండెకరాల భూమి కోసం తల్లి లాంటి పిన్ని (చిన్నమ్మ)ని వేటకొడవలితో అతి దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సులువాయి..
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో ఘటన
హొళగుంద, మే 22 (ఆంధ్రజ్యోతి): రెండెకరాల భూమి కోసం తల్లి లాంటి పిన్ని (చిన్నమ్మ)ని వేటకొడవలితో అతి దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సులువాయి గ్రామానికి చెందిన హరిజన గాదిలింగకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మల్లమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. చిన్న భార్య యల్లమ్మ(45)కు ముగ్గురు కుమార్తెలున్నారు. గాదిలింగ పేరుపై సులువాయిలో 2.5 ఎకరాల పొలం, యల్లమ్మకు రెండెకరాల పొలం ఉంది. ఈ పొలంపై పెద్ద భార్య కుమారుడు శేఖన్న కన్నుపడింది. కొన్నేళ్లుగా తండ్రి, పిన్నితో పొలం తన పేరుపై రిజిస్టర్ చేయాలని గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో గాదిలింగ భార్య పేరుపై ఉన్న పొలాన్ని అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్టు శేఖన్నకు తెలిసి కోపోద్రిక్తుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున తండ్రి ఇంటికి వెళ్లి ఆరుబయట నిద్రిస్తున్న యల్లమ్మను వేటకొడవలితో నరికాడు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆస్పరి సీఐ శ్రీనివాసనాయక్ తెలిపారు.