Share News

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:25 AM

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పంచాయతీ కార్యదర్శి. ఖమ్మం జిల్లా ముదిగొండ...

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం

  • ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి సురేశ్‌

ముదిగొండ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పంచాయతీ కార్యదర్శి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు ఇంటి నెంబర్‌ కోసం గత నెల 19న గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేశ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సురేశ్‌ రూ.40వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.25వేలకు సురేశ్‌ అంగీకరించగా.. ఆ తర్వాత వీరబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం ఉదయం సురేశ్‌ ముదిగొండలోని రైతువేదిక వద్ద ఉండగా ఏసీబీ అధికారుల పథకం ప్రకారం వీరబాబు రూ.25వేలు లంచం ఇచ్చాడు. ఆ వెంటనే అక్కడే ఉన్న ఏసీబీ బృందం సురేశ్‌ను అరెస్టు చేసింది.

Updated Date - Jun 28 , 2026 | 03:25 AM