Share News

కర్ణాటకలో టీచర్‌ దారుణ హత్య

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:13 AM

కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్యచేసి, నడిరోడ్డుపై మృతదేహాన్ని కాల్చివేశారు.

కర్ణాటకలో టీచర్‌ దారుణ హత్య

  • రోడ్డుపై మృతదేహం కాల్చివేత

బెంగళూరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్యచేసి, నడిరోడ్డుపై మృతదేహాన్ని కాల్చివేశారు. కలబురగి పట్టణంలోని ఆనంద్‌ కాలనీలో జ్యోతి కపాళె(57) నివసిస్తున్నారు. ఈమె బీదర్‌ జిల్లా భాల్కి తాలూకా వంజరఖేడలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారానికోసారి కలబురగికి వచ్చి వెళుతున్నారు. సోమవారం పాఠశాల విధులకు వెళ్తుండగా కమలాపుర తాలూకా కల్కూడ ప్రాంతంలో ఉపాధ్యాయురాలిపై మారణాయుధాలతో దాడి చేసి, హతమార్చారు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీనిపై కమలాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 06:15 AM