జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:37 AM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ వద్ద జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలు..
24 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కరీమాబీ
తాండూరు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ వద్ద జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలు.. తమ అప్పు తీర్చాలని కరీమాబీపై ఒత్తిడి తేగా.. ఆ అప్పును ఎగ్గొట్టేందుకు కరీమాబీ పక్కా ప్లాన్ వేసింది. మరో ఇద్దరితో కలిసి గతనెలలో ఆ ఇద్దరు మహిళలను ఫాంహౌ్‌సలో హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ కేసులో కేసులో కరీమాబీని కరన్‌కోట్ పోలీసులు విచారణ నిమిత్తం 25 రోజుల క్రితం పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కరీమాబీ బాత్ రూమ్‌కు వెళ్లి బాత్‌రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌ను సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాండూరులో ప్రథమ చికిత్స అనంతరం కరీమాబీని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 24 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు ఠాణాలో కరీమాబీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నిర్లక్ష్యం వహించారని వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సునీత, బస్వరాజ్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది జరిగిన రెండు రోజులకే కరీమాబీ మృతి చెందింది. కరీమాబీ తమకు లక్షల్లో బాకీ ఉన్నట్లు పలువురు మహిళలు.. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే పోలీసులకు ఫిర్యాదులు చేశారు.