Share News

చికిత్స పొందుతూ ప్రేమోన్మాది మృతి

ABN , Publish Date - May 18 , 2026 | 03:08 AM

తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో జడ్చర్లలో శనివారం ఓ యువతి గొంతు కోసి హతమార్చిన మణితేజ(29) అనే యువకుడు కూడా మరణించాడు.

చికిత్స పొందుతూ ప్రేమోన్మాది మృతి

జడ్చర్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో జడ్చర్లలో శనివారం ఓ యువతి గొంతు కోసి హతమార్చిన మణితేజ(29) అనే యువకుడు కూడా మరణించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌, ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన తన్నీరు మణితేజ(29) స్థానికంగా లాండ్రీ నిర్వహిస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవి (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేది. ఆ సమయంలో ప్రేమ, పెళ్లి పేరిట మణితేజ ఆమె వెంటపడేవాడు. మణితేజ వేధింపుల వల్ల హైదరాబాద్‌ నుంచి జడ్చర్లకు వచ్చేసిన వైష్ణవి.. పోలేపల్లి టీజీఐఐసీ ప్రాంగణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రిసెప్షని్‌స్టగా పనిచేస్తోంది. అయితే, శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైష్ణవిని మణితేజ వెంబడించాడు. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోతుండగా వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి దారుణంగా చంపేశాడు. అనంతరం మణితేజను పట్టుకున్న స్థానికులు కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.

Updated Date - May 18 , 2026 | 03:08 AM