Share News

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:30 AM

గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

రాయదుర్గం, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన అనిరుధ్‌(20) శనివారం మధ్యాహ్నం తాను చదువుతున్న ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలోని హాస్టల్‌ భవనం ఆరోఅంతస్తు పై నుంచి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 05:30 AM