Share News

హైదరాబాద్‌లో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:05 AM

నీట్‌ రీఎగ్జామినేషన్‌ ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ...

హైదరాబాద్‌లో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

  • పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణం !

హైదరాబాద్‌, జూన్‌ 20 : నీట్‌ రీఎగ్జామినేషన్‌ ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో షేక్‌ సనా(19) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సనా రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎ్‌సఆర్‌ కడప జిల్లాకు చెందిన జాఫర్‌ హుస్సేన్‌ కుటుంబం మియాపూర్‌లో నివాసముంటోంది. హుస్సేన్‌ ప్రస్తుతం కువైట్‌లో ఉంటున్నారు. జాఫర్‌ కుమార్తె సనా నీట్‌ పరీక్షకు సిద్ధమవుతోంది. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. శనివారం తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సనా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 21 , 2026 | 05:05 AM