Share News

రూ.2వేల అద్దె చెల్లించలేక..భార్య, కూతురిని యజమాని వద్దకు పంపిన వ్యక్తి

ABN , Publish Date - May 17 , 2026 | 05:08 AM

కేవలం రూ.2వేల అద్దె చెల్లించలేక ఓ వ్యక్తి కన్న కూతురిని, భార్యను ఇంటి యజమాని వద్దకు పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రూ.2వేల అద్దె చెల్లించలేక..భార్య, కూతురిని యజమాని వద్దకు పంపిన వ్యక్తి

  • ఇద్దరు నిందితుల అరెస్టు

  • గుజరాత్‌లో అమానవీయ ఘటన

మోర్బీ, మే 16: కేవలం రూ.2వేల అద్దె చెల్లించలేక ఓ వ్యక్తి కన్న కూతురిని, భార్యను ఇంటి యజమాని వద్దకు పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ దారుణమైన ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగు చూసింది. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల క్రితం మోర్బీ ప్రాంతానికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ.2వేల అద్దెకు ఒక ఇంట్లో ఉంటున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగు నెలలుగా వారు ఇంటి అద్దె చెల్లించలేకపోయారు. దీంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని గొడవ చేశారు. తాను అద్దె చెల్లించలేనని దానికి బదులుగా తన భార్య, మైనర్‌ కుమార్తెను లైంగికంగా వాడుకోవ్చని యజమానితో ఆ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు యజమాని ఆ తల్లీకూతుళ్లపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం మహిళ తన తల్లికి చెప్పడంతో ఆమె మోర్బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని ఇంటి యజమానిని అరెస్టు చేశారు.

Updated Date - May 17 , 2026 | 05:08 AM