Share News

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య ఘటనలో సర్పంచ్‌ సహా నలుగురిపై కేసు

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:05 AM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ ఆత్మహత్య ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ...

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య ఘటనలో సర్పంచ్‌ సహా నలుగురిపై కేసు

  • బిల్లులు చెల్లించక ఇబ్బందులు పెట్టారని సూసైడ్‌ నోట్‌

హుస్నాబాద్‌ రూరల్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ ఆత్మహత్య ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్‌ సీఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా ప్రస్తుత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్‌, 10వ వార్డు సభ్యుడు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ సంపత్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడంతో అందుకు అనుగుణంగా కేసు పెట్టారు. దాంతో బంధువులు శాంతించి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మంగళవారం బంధువులు ఆందోళనకు దిగడంతో పోస్టుమార్టం జరిగినా మృతదేహాన్ని అప్పగించలేకపోయారు. బుధవారం జిల్లా పంచాయతీ అధికారి వచ్చి పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు శాంతించారు.

Updated Date - Jun 25 , 2026 | 06:33 AM