Share News

నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు..?

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:04 AM

నేను లేకుంటే నువ్వు ఒంటరి అవుతావు. అప్పుడు నిన్నెవరు చూసుకుంటారు..?’ అని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు ఇస్రో మాజీ ఉద్యోగి.

నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు..?

  • భార్యను చంపేసిన ఇస్రో మాజీ ఉద్యోగి

బెంగళూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘నేను లేకుంటే నువ్వు ఒంటరి అవుతావు. అప్పుడు నిన్నెవరు చూసుకుంటారు..?’ అని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు ఇస్రో మాజీ ఉద్యోగి. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఆవలహళ్లి పరిధిలోని విర్టుసో అపార్ట్‌మెంట్‌లో నాగేశ్వరరావు(70), సంధ్యాశ్రీ (65) దంపతులు ఉంటున్నారు. వీరి కుమార్తె అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం. ఉద్యోగ విరమణ చేశాక, వృద్ధాప్యంలో నాగేశ్వరరావు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాను మృతి చెందితే తన భార్యను చూసుకునేవారు ఎవరూ లేరని, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయంతోనే చంపేశానని ఆయన అంగీకరించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:04 AM