Share News

కూతురిని బైక్‌పై ఎక్కించుకుని కాల్వలోకి దూకేశాడు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:18 AM

కూతురి పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. భార్యతో గొడవపడి.. మద్యం మత్తులో 16 నెలల పాపను బైక్‌పై ఎక్కించుకుని వేగంగా వెళ్లి పోలవరం కాల్వలో దూకేశాడు.

 కూతురిని బైక్‌పై ఎక్కించుకుని కాల్వలోకి దూకేశాడు!

  • మద్యం మత్తులో ఓ తండ్రి ఘాతుకం

  • చిన్నారి మృతి.. తండ్రిపై హత్యకేసు

జగ్గంపేట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కూతురి పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. భార్యతో గొడవపడి.. మద్యం మత్తులో 16 నెలల పాపను బైక్‌పై ఎక్కించుకుని వేగంగా వెళ్లి పోలవరం కాల్వలో దూకేశాడు. స్థానికులు వెంటనే బయటకు తీసేసరికే చిన్నారి మృతిచెందగా.. తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలేనికి చెందిన ఓడిబోయిన మణికంఠ, సాయమ్మ దంపతులకు 16 నెలల చిన్నారి లేస్‌ ఉంది. ఇద్దరూ ఇటీవల తరచూ గొడవ పడుతున్నారు. గురువారం మద్యం మత్తులో ఉన్న మణికంఠ భార్యను కొట్టి, గదిలో బంధించాడు. కూతురిని బైక్‌పై ఎక్కించుకుని నేరుగా గుర్రంపాలెంరోడ్‌లోని పోలవరం కాల్వలోకి మోటార్‌సైకిల్‌తో సహా దూకేశాడు. మణికంఠను జగ్గంపేట పోలీసులు అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 27 , 2026 | 03:19 AM