Share News

ఆటో సీటు చింపాడని కొడుక్కి వాతలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:49 AM

వేరొకరి ఆటో సీటు కవర్‌ను కోసి చింపాడనే కోపంతో తండ్రి.. తన కొడుక్కి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కాకినాడ జిల్లా...

ఆటో సీటు చింపాడని కొడుక్కి వాతలు

  • కాకినాడ జిల్లా ఒమ్మంగిలో దారుణం

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వేరొకరి ఆటో సీటు కవర్‌ను కోసి చింపాడనే కోపంతో తండ్రి.. తన కొడుక్కి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో జరిగింది. స్థానికంగా రెండో తరగతి చదువుతున్న పెండ్యాల నిహాల్‌ (7) శుక్రవారం రాత్రి ఆడుకుంటూ వేరొకరి ఆటో సీటు కవర్‌ను కోసి చింపాడు. ఈ విషయం తెలిసి నిహాల్‌ తండ్రి చంద్రయ్య కోపంతో ఊగిపోయాడు. ఇంటికి వచ్చిన నిహాల్‌ ముఖం, శరీర భాగాలపైన కాల్చి వాతలు పెట్టాడు. తీవ్రగాయాలైన నిహాల్‌కు శనివారం ఉదయం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Updated Date - Apr 05 , 2026 | 04:51 AM