Share News

ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో వికా్‌సకుమార్‌ అరెస్టు

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:25 AM

ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ స్కీమ్‌ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికా్‌సకుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్‌షాకోట్‌లో అరెస్టు చేశారు.

ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో వికా్‌సకుమార్‌ అరెస్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ స్కీమ్‌ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికా్‌సకుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్‌షాకోట్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ27గా ఉన్న వికా్‌సకుమార్‌.. ఫాల్కన్‌ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ కుమార్‌తో కలిసి పెద్దఎత్తున మోసానికి తెరలేపాడని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్కన్‌ గ్రూపు 7,056 మంది నుంచి రూ.4,215 కోట్ల డిపాజిట్లు సేకరించి, అందులో 4,065 మంది డిపాజిట్‌దారులకు వారి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడిందని ఆమె వివరించారు.

Updated Date - Feb 26 , 2026 | 02:25 AM