Share News

నకిలీ వివరాలతో 4 పాస్‌పోర్టులు.. వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:47 AM

వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో బహుళ భారతీయ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా కోసం ప్రయత్నించిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ వివరాలతో 4 పాస్‌పోర్టులు.. వ్యక్తి అరెస్టు

రాయదుర్గం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో బహుళ భారతీయ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా కోసం ప్రయత్నించిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్‌కు చెందిన మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌రెడ్డి వివిధ పుట్టిన తేదీలు, చిరునామాలు, గుర్తింపు కార్డులతో బహుళ పాస్‌పోర్టులు తీసుకున్నాడు. ముద్దన్నోళ్ల లక్ష్మీకాంత్‌, మేధ ప్రసూన్‌కుమార్‌రెడ్డి, మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌రెడ్డి తదితర పేర్లతో అతడికి నాలుగు పాస్‌పోర్టులు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 16 , 2026 | 06:47 AM