భార్యపై కోపంతో.. కూతురిని బావిలో పడేశాడు
ABN , Publish Date - May 16 , 2026 | 06:24 AM
నాన్నంటే నమ్మకం.. నాన్నంటే భరోసా.. కానీ.. అలాంటి నాన్నే కర్కశంగా మారి చంపేస్తాడని తెలియదు ఆ చిన్నారికి! తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన..
తూర్పుగోదావరి జిల్లాలో ఓ తండ్రి ఘాతుకం
కోరుకొండ, మే 15(ఆంధ్రజ్యోతి): నాన్నంటే నమ్మకం.. నాన్నంటే భరోసా.. కానీ.. అలాంటి నాన్నే కర్కశంగా మారి చంపేస్తాడని తెలియదు ఆ చిన్నారికి! తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన రాజవరపు రాజు మద్యం మత్తులో తన కన్నకూతురు లహరి(4)ని శుక్రవారం బావిలోకి విసిరేయగా మృతిచెందింది. 15 రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం కిందట కుమార్తెలను అత్త, భర్త వద్ద వదిలి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ కోపంతో రాజు మద్యం సేవించి గురువారం రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. తల్లి మందలించడంతో తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయటకు వెళ్లాడు. అయితే ఏడేళ్ల పెద్ద కుమార్తె అతడి నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి పారిపోయింది. తండ్రి వెంటే ఉన్న లహరిని గురువారం రాత్రి బావిలో పడేశాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి బాలిక విగతజీవిగా కనిపించింది. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.