Share News

ఢిల్లీలో 30 ఏళ్ల యువ జడ్జి ఆత్మహత్య

ABN , Publish Date - May 03 , 2026 | 04:06 AM

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఏరియాలో ఉన్న గ్రీన్‌ పార్క్‌ ఏరియాలో నివసించే యువ జడ్జి అమన్‌శర్మ (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు.

ఢిల్లీలో 30 ఏళ్ల యువ జడ్జి ఆత్మహత్య

న్యూఢిల్లీ, మే 2: ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఏరియాలో ఉన్న గ్రీన్‌ పార్క్‌ ఏరియాలో నివసించే యువ జడ్జి అమన్‌శర్మ (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. స్నానాల గది తలుపునకు గడియపెట్టి , లోపల చిన్న వస్త్రంతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. 2018లో పుణెలోని సింబియాసిస్‌ లా స్కూల్‌లో డిగ్రీ చదివిన అమన్‌ 2021లో ఢిల్లీ జ్యుడీషియల్‌ సర్వీసులో చేరారు. వివిధ కోర్టుల్లో పనిచేసిన అనంతరం ప్రస్తుతం కర్కర్‌డూమా కోర్టులో జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భార్యతో తలెత్తిన సమస్యలే అమన్‌ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. రెండు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని అమన్‌ తండ్రి తెలిపాడు.

Updated Date - May 03 , 2026 | 04:06 AM