Share News

తల్లి గొంతు కోసిన కుమార్తె

ABN , Publish Date - May 26 , 2026 | 05:24 AM

వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన ఓ కుమార్తె ఘాతుకానికి పాల్పడింది. తాను మూడో పెళ్లికి సిద్ధమవగా తల్లి ఒప్పుకోకపోవడంతో..

తల్లి గొంతు కోసిన కుమార్తె

  • తన మూడో పెళ్లికి ఒప్పుకోలేదని ఘాతుకం

  • నెల్లూరు జిల్లాలో దారుణం

ఆత్మకూరు, మే 25(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన ఓ కుమార్తె ఘాతుకానికి పాల్పడింది. తాను మూడో పెళ్లికి సిద్ధమవగా తల్లి ఒప్పుకోకపోవడంతో.. గొంతుకోసి చంపాలని ప్రయత్నించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. మల్లి రమణమ్మ అనే మహిళకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమారుడు మృతి చెందగా, కుమార్తె సుమతి.. తల్లి చెంతనే ఉంటోంది. సుమతికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త చనిపోగా, రెండో భర్త నుంచి విడిపోయింది. మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. ఇందుకు తల్లి రమణమ్మ అంగీకరించకపోవడమే కాకుండా.. తన వద్ద ఉన్న నగదు, బంగారం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తల్లిపై సుమతి కక్ష పెంచుకుంది. సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తల్లిపై దాడి చేసి బ్లేడుతో గొంతు కోసేసింది. రమణమ్మ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని సుమతిని పట్టుకున్నారు. రమణమ్మను ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు రెఫర్‌ చేశారు.

Updated Date - May 26 , 2026 | 05:27 AM