Share News

నాన్నా.. నీ వెంటే నేనూ!

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:03 AM

తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఒకే ఇంట్లో కేవలం 18 రోజుల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి చెందిన...

నాన్నా.. నీ వెంటే నేనూ!

  • తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

  • హైదరాబాద్‌లో ఘటన.. స్వగ్రామం చాట్రాయి

చాట్రాయి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఒకే ఇంట్లో కేవలం 18 రోజుల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి చెందిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతుండగా, ఏలూరు జిల్లా చాట్రాయిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాలివీ.. చాట్రాయిలోని వికాస్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ పాములపాటి చెన్నకేశవరెడ్డి గత నెల 31న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె జ్ఞానశ్రీ(21) హైదరాబాద్‌ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతోంది. తండ్రి మృతి చెందిన రోజు చాట్రాయి వచ్చిన జ్ఞానశ్రీ, దశ దినకర్మ తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. తండ్రి మృతి చెందిన నాటి నుంచీ ఆమె తీవ్ర మనోవేదనతో కుమిలిపోతూ ఉంది. ఈ క్రమంలో గురువారం హాస్టల్‌ గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్యహత్యకు పాల్పడింది. అక్కడ ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు తెలిసింది. పోస్ట్‌మార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం జ్ఞానశ్రీ భౌతికకాయాన్ని చాట్రాయి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. జ్ఞానశ్రీ మృతితో తల్లి, తమ్ముడు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 04:04 AM