Share News

అక్కతో తరచూ గొడవపడుతున్నాడని..

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:23 AM

తన అక్కను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ బామ్మర్ది... తన బావను దారుణంగా హత్య చేశాడు.

అక్కతో తరచూ గొడవపడుతున్నాడని..

  • స్నేహితులతో కలిసి బావను చంపిన బామ్మర్ది

కార్వాన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తన అక్కను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ బామ్మర్ది... తన బావను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గోల్కొండ పరిధిలోని ఫతేదర్వాజా, కుమ్మర్‌వాడీ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. పాతబస్తీకి చెందిన చాంద్‌ మసూద్‌ గోల్కొండ ప్రాంతానికి చెందిన రుక్సునాను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయున కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తతో గొడవ పెట్టుకున్న రుక్సునా ఇటీవల గోల్కొండ కుమ్మర్‌వాడీలో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది. చాంద్‌ మసూద్‌ కూడా శుక్రవారం అక్కడికి వెళ్లి తన భార్యతో మరోసారి గొడవకు దిగాడు. పెళ్లయిన నాటి నుంచి తన అక్కను ఇలాగే వేధిస్తున్నాడని కోపోద్రిక్తుడైన అతడి బామ్మర్ది సోయల్‌ తన స్నేహితులు జాబేర్‌, అప్పుతో కలిసి చాంద్‌ మసూద్‌ పై రాడ్డు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చాంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. హత్య కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. మృతుడు చాంద్‌ మసూద్‌ పలు వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Updated Date - Jun 13 , 2026 | 07:25 AM