భర్తను సుత్తితో కొట్టి చంపిన మతిస్థిమితం లేని భార్య
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:40 AM
మతిస్థిమితం లేని ఓ భార్య తన భర్తను నిద్రిస్తున్న సమయంలో సుత్తితో కొట్టి చంపింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణంలో జరిగింది.
భువనగిరి జిల్లా గుండాలలో ఘటన
గుండాల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని ఓ భార్య తన భర్తను నిద్రిస్తున్న సమయంలో సుత్తితో కొట్టి చంపింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణంలో జరిగింది. కూలీగా పనిచేసే మాదరబోయిన భిక్షం (64) భార్య ఉపేంద్రకు 20 ఏళ్లుగా మతిస్థిమితం సరిగాలేదు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భిక్షంను భార్య ఉపేంద్ర సుత్తెతో కొట్టి చంపి రోడ్డుపై నిల్చుంది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ప్రశ్నించగా.. తన భర్తను కొట్టానని రక్తం వస్తుందని తెలిపింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే భిక్షం విగతజీవిగా ఉన్నాడు. భువనగిరి డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్‌గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య ఉపేంద్రను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఉపేంద్ర తన భర్తపై బండ రాయితో, గొడ్డలితో దాడి చేసిందని గ్రామస్థులు చెప్పారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా వారికి వివాహాలు జరిగాయి.