Share News

దారుణం.. డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..

ABN , Publish Date - Jun 29 , 2026 | 10:00 PM

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్‌ పేరిట ఇంటికి పిలిపించిన ఒక యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.

దారుణం..  డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..
Bengaluru man Kills Lover

ఇంటర్నెట్ డెస్క్: ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్ పేరిట ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో తాజాగా వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అంజలి, రాజీవ్ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒక సంస్థలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే, రాజీవ్ నేపథ్యం నచ్చని అంజలి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. వారికి నచ్చ చెప్పేందుకు రాజీవ్ అనేక మార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మరోవైపు, కుటుంబం ఒత్తిడి పెరగడంతో అంజలి కూడా రాజీవ్‌ను దూరం పెట్టసాగింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాజీవ్ అంజలిని డిన్నర్‌కు రమ్మని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమెతో పెళ్లి విషయమై మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో అంజలి వెళ్లిపోతుండగా అతడు వెనక నుంచి ఆమె మెడపై కత్తితో పొడిచాడు.


తీవ్ర గాయాలపాలైన అంజలిని ఇరుగుపొరుగు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అంజలి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలనూ చదవండి:

బాలికపై చర్చి పాస్టర్‌ కుటుంబం దాష్టీకం

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

Updated Date - Jun 29 , 2026 | 10:35 PM