Share News

ఆంధ్ర మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:45 AM

ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పీజీ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కాశిమళ్ల ఠాగూర్‌నాథ్‌ (32) ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో నాలుగు నెలల కిందట ఫోరెన్సిక్‌ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాడు.

ఆంధ్ర మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థి ఆత్మహత్య

విశాఖపట్నం/మహారాణిపేట, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పీజీ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కాశిమళ్ల ఠాగూర్‌నాథ్‌ (32) ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో నాలుగు నెలల కిందట ఫోరెన్సిక్‌ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాడు. కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఠాగూర్‌నాథ్‌ తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉంటూ, రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఠాగూర్‌ శుక్రవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్‌ రూమ్‌లోనే ఉండిపోయాడు. తొలుత కాళ్లు, చేతులు కోసుకుని, తర్వాత రూమ్‌లోని ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకున్నాడు. ఆస్పత్రిలో విధులకు రాకపోవడంతో సహచర విద్యార్థి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో 12 గంటల సమయంలో హాస్టల్‌కు వెళ్లిచూడగా ఉరి వేసుకుని కనిపించాడు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 05:48 AM